కోట, జనవరి 08, (రవికిరణాలు) : అంగన్వాడి"వర్కర్స్ అండ్ హెల్పర్స్"యూనియన్ ఆధ్వర్యంలో చిట్టమూరు తహసీల్దారు కార్యాలయం వద్ద సమ్మెను ఏర్పాటు చేశారు. చిట్టమూరు మండలంకు సంబంధించి" మూడు సెక్టార్లకు చెందిన అంగన్వాడీ వర్కర్లు అందరూ సమ్మెలో పాల్గొన్నారు. సెక్టార్ లీడరు షాహినా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు అందరూ కలసి సార్వత్రిక సమ్మె చేస్తున్నామని అన్నారు. అంగన్వాడి లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నెలకు కనీస వేతనం 21000 ఇవ్వాలని ప్రతి కార్మికులకు 10 వేలకు తగ్గట్టుగా పెన్షన్ తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని అన్నారు. అంగన్వాడి సెంటర్లకు ప్రతినెల నాణ్యమైన ఫీడింగ్ సరఫరా చేయాలని అన్నారు. అంగన్వాడీలకు రేషన్ కార్డులు కొనసాగించాలి రాజకీయ వేధింపులు అరికట్టాలని వేతనంతో కూడిన మూడు నెలలు మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి. పెండింగ్ వేతనాలు బిల్లులు వెంటనే  చెల్లించాలని అన్నారు. ఖాళీగా ఉన్న అంగన్ వాడీవర్కర్లు హెల్పర్లు సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. అనంతరం చిట్టమూరు మండలం తహసిల్దార్ రవికుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్లు సరోజ కస్తూరి అమ్మ మస్తానమ్మ అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.