ఆదాలతో ఆనం భేటీ





నెల్లూరు, మేజర్ న్యూస్ : మాజీ ఎంపీ, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతం రాజకీయ అంశాలపై చర్చించారు. అనంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పార్టీ కమిటీలో నూతనంగా నియమితులైన నెల్లూరు రూరల్ నాయకులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమితులైన వారందరినీ ఆనం విజయకుమార్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి ని శాలువాలతో పుష్ప గుచ్చంలతో మర్యాదపూర్వకంగా కలిపించారు. 

ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.