రైలు నుండి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

 రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం న్యూస్:- మండల పరిధిలోని టపాఇండ్లు గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ ఫై రైల్లోనుంచి జారుపడి మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు ఈ సందర్భంగా సూళ్లూరుపేట రైల్వే ఎస్సై జి మాల కొండయ్య తెలుపుతూ మంగళవారం 9 గంటల సమయంలో పోలిరెడ్డి పాలెం నుండి సూళ్లూరుపేటకు రైల్వే స్టేషన్ మధ్యలో టపాయిడ్లు గ్రామ సమీపాన దిగువ రైలు మార్గంలో ఈ వ్యక్తి మృతి చెంది ఉన్నాడు ఇతని వయసు 35 సంవత్సరాలు ఉండవచ్చు ఇతను వద్ద ఎలాంటి ఆధారాలు లేవు మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించడం జరిగిందని తెలిపారు ఈ కేస్ రైల్వే ఎస్సై మాలకొండయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు