మాన్నార్ పోలూరు గ్రామం నుండి అమ్మున్నికి సారె.
తిరుపతి జిల్లా,సూళ్లూరుపేట :-
శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం లో శరన్నవరాత్రులు మూడవ రోజు సంద్భంగా అమ్మవారికి మన్నారుపోలూరు గ్రామం, నూకలపాళెం, వట్రపాళెం నుంచి మేళతాలతో ఊరేగింపుగా భక్తులు తరలివచ్చి సారెను అత్యంత వైభవముగా సమర్పిచారు. బుధవారం అమ్మవారిని శ్రీ గాయత్రి అలంకారములో భక్తులు దర్శించుకొన్నారు. అలంకారం ఉభయకర్తలుగా నెల్లూరుకు చెందిన గునపాటి మురళికృష్ణా రెడ్డి శ్రీమతి ప్రతిమ వ్యవహరించారు. సాంస్కృతిక కార్యక్రమములు భారతి సంగీత విద్యాలయము నెల్లూరు వారిచే భక్తి సంగీత కచ్చేరి నిర్వహించారు. ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి సమక్షంలో ఆలయ ఈఓ ఆళ్ల శ్రీనివాసుల రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ ఛైర్మన్, దబ్బల శ్రీమంత్ రెడ్డి, కళత్తూరు జనార్ధన్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాళ చంద్రశేఖర్ రెడ్డి, వంకా దినేష్ కుమార్, బండి సునీత, మన్నేముద్దు పద్మజ, పెనుబేటి మారమ్మ మాజీ సభ్యులు గోగుల తిరుపాలు,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.