షరతులు  లేకుండ అర్హులైన ప్రతి పేద విద్యార్థికి అమ్మవడి ఇవ్వాలి - ఎస్. ఎఫ్. ఐ 

రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-

 షరతులు  లేకుండా ప్రతి పేద విద్యార్థికి అమ్మవడి ఇవ్వాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు భగత్ రవి, సూళ్లూరుపేట ఎస్ ఎఫ్ ఐ నాయకులు నాగరాజు, సుమన్ లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసి బస్టాండ్ వద్ద వున్న డా"బి .అర్ అంబేద్కర్ విగ్రహం ముందు విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అమ్మవడి కోత కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.  అనంతరం ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు రవి మాట్లాడుతు మొదట్లో చదివే ప్రతి బిడ్డకు అమ్మవడి ఇష్టం అని, చదివించడం ప్రభుత్వ భాద్యత అంటూ చెప్పిన  సీఎం గారు నేడు అనేక షరతులు పెట్టి 1.34 వేల మందికి అమ్మవడి కు ఇవ్వకుండా దూరం చేసారని వారు మండిపడ్డారు. ఎలాంటి షరతులు  లేకుండా అర్హలైన  వారందరికీ అమ్మవడి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అమ్మవడి ద్వారా ఎంతో కొంత విద్యార్థుల చదువులు మెరుగుపడుతున్నాయి అని ఇలాంటి సమయంలో కోత పెట్టడం సరికాదని వారు అన్నారు. కోత కోసిన 1.34 వేల మంది విద్యార్థులకు తిరిగి అమ్మవడి ను ఇవ్వాలని లేని పక్షంలో ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులు పాల్గొన్నారు.