శతాబ్ది వేడుకలను వాయిదా వేసుకున్న పూర్వపు విద్యార్థులు.
శతాబ్ది వేడుకలను వాయిదా వేసుకున్న పూర్వపు విద్యార్థులు.
తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల కి సంబంధించి నిర్వహించనున్న శతాబ్ది వేడుకలు తేదీని మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరిగే SSC , ఇంటర్ పరీక్షలు ప్రభుత్వం వాయిదా వేయడం వల్లే తేదీల మార్పు అనివార్యంగా మారింది, మే 15 న జరగాల్సిన శతాబ్ది వేడుకలను ఆగస్టు 14 వ తేదికి మార్పు చేశారు, ఈ మార్పును పూర్వ విద్యార్థులందరూ గుర్తించి మీకు తెలిసిన పూర్వ విద్యార్థులకు కూడా సమాచారం అందించవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు, మెగా మీట్ సన్నాహక సమావేశం లో మెగా మీట్ తేదీ మార్పు పై నిర్ణయం తీసుకోవడం జరిగింది, మే 10 వ తేదీ లోగా పూర్వ విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు, మెగా మీట్ ఏర్పాట్లు కోసం తొమ్మిది కమిటీలతో ఏర్పాట్లు పర్యవేక్షణ జరుగుతుందని శ్రీనివాసులు రెడ్డి తెలియజేసారు,ఈ సమావేశం లో లవిశేట్టి శ్రీనివాసులు, ఉస్మాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.