కరోనా నివారణకు ప్రజలందరూ సహకరించాలి

రాజ్యసభ సభ్యులు వి.పి.ఆర్.సేవలు అద్భుతం::మంత్రి అనిల్


నెల్లూరు నగరంలోని జెడ్.పి.సమావేశ మందిరంలో,సోమవారం  కోవిడ్ నియంత్రణపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కోవిడ్ కేసులు జిల్లాలో రోజురోజుకు పెరుతున్న వేళా,ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ను నివారించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతోందని,ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తగిన మార్గదర్స కాలను విడుదల చేశారని,జిల్లా ప్రజలందరూ వాటిని పాటిస్తూ,తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.జిల్లాలో సమర్ధవంతంగా కోవిడ్ ను ఎదుర్కునేందుకు ఎప్పటి కప్పుడు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని,ప్రజలు తప్పనిసరిగా మాస్కులను ధరించి,భౌతిక దూరం పాటించాలన్నారు.ఆసుపత్రులలో అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని,ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.అలాగే జిల్లా అధికారులకు,సిబ్బందికి ఆయన పలు సలహాలు,సూచనలను అందించారు.ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్లు హరెందిరా ప్రసాద్,గణేష్ కుమార్, నెల్లూరు రూరల్ ఎం.ఎల్.ఎ.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,కమీషనర్ దినేష్ కుమార్,పలు శాఖల అధికారులు,సిబ్బంది, తదితరులున్నారు. అనంతరం గొలగమూడి రోడ్డులోని  వి.పి.ఆర్. కన్వెన్షన్ సెంటర్ నందు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించు ఆక్సిజన్ కన్సెన్ ట్రేటర్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్  పాల్గొన్నారు.ఈ కార్యక్రమములో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,టి.టి.డి.సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎం.పి.గురుమూర్తి,సర్వేపల్లి ఎం.ఎల్.ఎ.లు కాకాణి గోవర్ధన్ రెడ్డి,కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,కిలివేటి సంజీవయ్య,రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి,డా.వెలగపల్లి వరప్రసాదరావు,ఎం.ఎల్.సి.బల్లి కళ్యాణ్ చక్రవర్తి,జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ,విజయడైరి చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డి.సి.ఎం.ఎస్.చైర్మన్ వీరి చలపతి రావు.డిప్యూటి మేయర్ రూప్ కుమార్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరూ మాట్లాడుతూ,కరోన రెండవ సారి ప్రభలిన సమయములో ఆక్సీజన్ లేమితో పేషెంట్స్ చాలా ఇబ్బందులకు గురయ్యారని, నేడు ఒమిక్రాన్ విజ్రూంబిస్తున్న తరుణంలో ముందు జాగ్రత్తగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఉచిత పంపిణి చేయడం వేమిరెడ్డి సేవలు అభినందనీయం అంటూ అభినందించారు.