నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ శాసన సభా హక్కుల కమిటీ చైర్మన్,వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాయి. భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ కు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా "పరిపాలన వికేంద్రీకరణ" అనే చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు.గత చేదు జ్ఞాపకాలను, అనుభవాలను ఎన్నో చూశాం.అందరం కలిసి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ ను అక్కడ ఏర్పడిన ప్రాంతీయ వాదం వల్ల విడిపోయి, కట్టుబట్టలతో వచ్చాము.అటువంటి ఏర్పాటువాద ఆలోచన రాకుండా, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని పరిపాలన వికేంద్రీకరణకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.చంద్రబాబు మాత్రం ఆయన స్వలాభం కోసం, అక్రమ ఆస్తుల పోతాయని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు.చంద్రబాబుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఇష్టంలేక పెయిడ్ ఆర్టిస్టులతో వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నాడు.చంద్రబాబుకు మానవ వనరుల అభివృద్ధి సూచిక అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి!.అనేక రకాల కమిటీలు కూడా రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగాలని సూచించాయి.చంద్రబాబు మాత్రం రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదనే విధంగా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు.గత ప్రభుత్వంలో, గత పాలకులు అమరావతిలో పొలాలు ఎందుకు కొన్నారో సమాధానం చెప్పలేని పరిస్థితి!.చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కన్నా స్వార్ధ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నాడు.తాత్కాలిక రాజధాని, తాత్కాలిక అసెంబ్లీ అని గతంలో స్వయంగా చంద్రబాబు చెప్పిన పరిస్థితి.చంద్రబాబు మాటలు మార్చడం, అబద్ధాలు చెప్పడంలో, మోసాలు చేయడంలో దిట్టా.ప్రజా చైతన్య యాత్ర అంటూ చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. పేద విద్యార్థులకు ఉపయోగపడే ఇంగ్లీష్ విద్యా, యస్.సి.,యస్.టి. లకు ప్రత్యేక కార్పొరేషన్ ల ఏర్పాటుకి చంద్రబాబు అడ్డుకుంటున్నాడు.
రాష్ట్రాభివృద్ధి కోసం ఏనాడు గాజులు అమ్మని వారు,స్వలాభం పొందాలని, అమరావతి కోసమంటూ నటిస్తున్నారు.జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగేలా పని 
చేస్తున్నారు.కానీ చంద్రబాబు మాత్రం సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.గత ఐదు సంవత్సరాలలో 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిన చంద్రబాబు, ఈ లెక్కన అమరావతిలో అభివృద్ధి చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది!.పరిపాలన వికేంద్రీకరణ తోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.ముస్లింలకు వైయస్సార్సీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా 
ఎమ్మెల్యే కాకాణి తెలియజేశారు.