శక్తి టీమ్ ల సేవలు బలోపేతం కొరకు అన్ని చర్యలు - ఎస్పి
నెల్లూరు, జనవరి 23, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా ప్రధాన పట్టణాలలోని వివిధ పాఠశాలలు, కాలేజీలలో మహిళలు, బాలలు పై జరిగే అకృత్యాలతో పాటు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, చైన్ స్నాచింగ్ మొదలగు నేరాలు అరికట్టుట గురించి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రత్యేకించి దిశ చట్టం పై అవగాహన, ఇంకా అనేక అసాంఘిక కార్యక్రమాలు అడ్డుకట్ట వేయుటలో శక్తి టీమ్ సేవలు విస్తృతం చేయాలని జిల్లా యస్పి దిశానిర్దేశం చేసారు.గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి లక్ష్మీనారాయణతో పాటు జిల్లాలోని శక్తి టీమ్ ల సేవలు మరింత మెరుగు పరిచేందుకు ఏర్పాటు చేయబడిన ఇంటరాక్షన్ లో
జిల్లా యస్పి భాస్కర్ భూషణ్, మాట్లాడుతూ పాఠశాలలు, కాలేజీలలో దిశా చట్టంపై అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలని, మహిళలు, బాలలు, వృద్ధులపై జరిగే హింస లైంగిక వేదింపులు, ఈవ్ టీజింగ్ లు మొదలగు విషయాల గురించి సూచనలిస్తూ, దాడులు జరగకుండా చూడాలని, శక్తి టీం సభ్యులు ప్రతి రోజూ, వారి వారి పరిధిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని కలిసి వారి దైనందిక కార్యక్రమాల ఆచరణ గురించి మాట్లాడటం, ఎక్కడ ఎక్కడ అవగాహన కార్యక్రమాలు జరుగనున్నాయో తెలియపరదాలని ఆదేశించారు. అవసరం మేరకు పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షక్, పోలీస్ కానిస్టేబుల్ ల సహాయం కోరాలని తెలుపుతూ, మీకు అన్నీ విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యస్పితో పాటు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి లక్ష్మీనారాయణ జిల్లాలోని శక్తి టీమ్ ల సభ్యులు అందరూ పాల్గొన్నారు.