ఆమంచర్ల గ్రామంలో వ్యవసాయ పరికరాలు పంపిణీ కార్యక్రమం
ఆమంచర్ల గ్రామంలో వ్యవసాయ పరికరాలు పంపిణీ కార్యక్రమం
నెల్లూరు, రవికిరణాలు ఏప్రిల్ 09 :
నెల్లూరు రూరల్ మండలం లోని
ఆమంచర్ల గ్రామంలో వ్యవసాయ పరికరాలు పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా వ్యవసాయ అధికారిని పి. సత్యవాణి సహాయ వ్యవసాయ సంచాలకులు శేషగిరిరావు, సహాయ వ్యవసాయ సంచాలకులు నందం శ్రీనివాసులు మండల వ్యవసాయ అధికారి నాగమోహన్ నెల్లూరు మండల వ్యవసాయ విస్తరణ అధికారులు హాజరైనారు జిల్లా వ్యవసాయ అధికారిని ద్వారా వ్యవసాయ పనిముట్లు మండలంలోని అందరి లబ్ధిదారులకు అందించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆమంచర్ల టిడిపి నాయకుడు వేణు నాయుడు గొల్ల కందుకూరు నుండి శివకుమార్ రెడ్డి మరియు అన్ని గ్రామాల రైతు సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 15 తైవాన్ స్ప్రేయర్లు మరియు ఒక రోటవేటరు, కల్టివేటర్లు లబ్ధిదారులకు అందజేయడం జరిగినది.