నెల్లూరు, డిసెంబర్‌ 28, (రవికిరణాలు) : శనివారం నెల్లూరులోని గ్లోబల్‌ హాస్పిటల్‌ ఇన్పర్మేషన్‌ సెంటర్‌నకు ప్రముఖ క్యాన్సర్‌ వ్యాధుల శస్త్ర చికిత్సా వైద్య నిపుణులు ప్రొఫెసర్‌ డాక్టర్‌.ఎస్‌.రాజాసుందరం విచ్చేయడం జరిగింది. భార్గవ్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉమెన్స్‌ హెల్త్‌ ఫెస్టివల్‌ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొని తదనంతరం ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌లో పాత్రికేయ సమావేశాన్ని  నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో క్యాన్సర్‌ వ్యాధి అనేది పెరిగిపోతూ వుందని దానికి తగు జాగ్రత్తలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌, బ్రెయిన్‌ క్యాన్సర్‌, పేగు క్యాన్సర్‌లు ముందస్తుగానే గుర్తించినట్లయితే వాటి నుండి బయటపడవచ్చునని చెప్పారు. ఈ క్యాన్సర్లకు కారణాలు అనువంశికత ద్వారా వచ్చేవి కొన్ని అయితే ప్రస్తుత ఆహరపు అలవాట్లు కూడా ఒక కారణమని పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్‌లో మెమోగ్రాము యెుక్క ప్రాధాన్యత గురించి వివరించారు. తాను గ్లోబల్‌ హాస్పిటల్‌ చెన్నైలో క్యాన్సర్‌ వ్యాధి డిపార్ట్‌మెంట్‌కు డైరెక్టరుగా ఉన్నానని అన్ని రకాల క్యాన్సర్లకు సంబంధించిన పూర్తి స్థాయి ట్రీట్‌మెంట్‌ తమ హాస్పిటల్‌లో లభ్యమవుతుందని ఎక్కడా తిరగవలసిన అవసరం రాదు అని చెప్పారు. అనుభవజ్ఞులైన డాక్టర్లు అత్యాధునిక వైద్య పరికరాలు తమ వద్ద ఉన్నాయని, ఎలాంటి క్యాన్సర్‌ అయినా మేము
తగిన వైద్యం అందించగలమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్‌ హాస్పిటల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ అడియార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూయ్‌ తరహాలోనే తమ హాస్పిటల్‌ క్యాన్సర్‌ విభాగము పని చేస్తుందని అన్ని రకాల వర్గాల ప్రజలకు అందుబాటులోనే వుంటుందని తమ యెుక్క క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ సేవలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.