చెంగాళ్ళమ్మ తల్లిని దర్శించుకున్న దేవదాయ శాఖ అదనపు కమిషనర్ టి చందు కుమార్ దంపతులు .

రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-

 పట్టణంలోని కాలంగి నది ఒడ్డున వెలసియున్న తెలుగు తమిళ ఆరాధ్య దైవం భక్తుల కొంగు బంగారం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి దక్షిణ ముఖ ఖాళీ శ్రీశ్రీశ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని శుక్రవారం దేవదాయశాఖ అదనపు కమీషనర్  టి.చంద్రకుమార్ దంపతులు దర్శించుకొన్నారు. వారిని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారి ప్రసాదములు అందజేసి వేదపండితులచే ఆశీర్వచనము చేయుట జరిగినది.ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాళ చంద్రశేఖర్ రెడ్డి, వంకా దినేష్ కుమార్, ఓలేటి బాల సత్యనారాయణ, కర్లపూడి సురేష్ బాబు, శ్రీమతి మన్నెముద్దు పద్మజ, శ్రీమతి బండి సునీత పాల్గొన్నారు.