లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పు
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పు
నెల్లూరు నగరములోని స్కానింగ్ కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి డాII ఎమ్.పెంచలయ్య గారి ఆదేశాలుమేరకు జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారిని/జిల్లా నోడల్ అధికారిని డాII ఏ. ఉమామహేశ్వరి జిల్లా మాస్ మీడియా అధికారి, జిల్లా ప్రోగ్రామ్ అధికారి కె. కనకరత్నం లు శిరీష స్కానింగ్ కేంద్రము రత్న సాయి డియగ్నోస్టిక్ కేంద్రము లను ఆకస్మిక తనికీలను శుక్రవారం నిర్వహించినారు. స్కానింగ్ కేంద్రము లు నిర్వహిస్తున పలు రికార్డులు, నివేదికలు, ఫామ్-F లను అధికారులు తనికీ చేసి పరిశీలించినారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సంధర్భంగా జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారిని/జిల్లా నోడల్ అధికారిని డాII ఏ. ఉమామహేశ్వరి స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులను ఎట్టి పరిస్థితులలోనూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించరాదని, అట్లు చేసిన ఎడల గర్భస్థ లింగ నిర్ధారణ నిషేద చట్టం పీసీ పిఎన్డిటి చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినారు. ధరల పట్టిక ప్రదర్శించాలని స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించినారు. పిసి అండ్ పిఎన్డిటి చట్టము పరిధిలో స్కానింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్న యజమాన్యాన్ని డాII ఏ. ఉమామహేశ్వరి గారు అభినంధించారు.ఇలాగే ఇక ముందు కూడా నిర్వహించుకోవాలని సూచించారు. స్కానింగ్ కేంద్రాల నిర్వహకులకు పిసి అండ్ పి ఎన్ డి టి చట్టము నియమ నిబంధనల పై అవగాహన కల్పించినారు. స్కానింగ్ పరీక్షలు నిర్వహించిన ప్రతి గర్భిణీ స్త్రీ వివరములను సoబంధిత ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసి, సoబంధిత నెల వారి నివేదికలను ప్రతి నెల 2 వ తేదీ లోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి వారి కార్యాలయము లోని డెమో విభాగములో సమర్పించవలసినిది గా ఆదేశించినారు. సకాలంలో నెల వారి నివేదికలను సమర్పించని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనికీలో వీరివెంట హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీ అశోక్ పాల్గొన్నారు.