నకిలీ పట్టాలు సృష్టించిన వారిపై చర్యలు చేపట్టాలి
*నకిలీ పట్టాలు సృష్టించిన వారిపై చర్యలు చేపట్టాలి"
గోవిందపల్లి రైతులు రావి కిరణాలు ప్రతినిధి చిట్టా మురూ
కోట మండలం కొత్తపట్నం పంచాయితీ పరిధిలోని గోవిందపల్లి గ్రామానికచెందిన భూముల విషయంలో నకిలీ పట్టాలు సృష్టించిన వారిపై చర్యలు చేపట్టాలని గోవిందపల్లి గ్రామానికి చెందిన రైతులు తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసనతెలిపారు . ఈ సందర్భంగా రైతులు నకిలీ పట్టాలు సృష్టించిన వారిపై ఫిర్యాదు చేశారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం వద్ద పత్రికా విలేకరులతో మాట్లాడుతూ గత 40 సంవత్సరములుగా గ్రామంలోని దళితులందరము సమిష్టిగా సాగు చేసుకున్నటువంటి భూములకు కొంతమంది వ్యక్తులు నకిలీ పట్టాలను తీసుకొచ్చి భూములను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారన్నారు. 40 సంవత్సరాలుగా లేని పట్టాలు ఇప్పుడు ఎలా వచ్చాయని ఆ పట్టాలు ఎవరు ఇచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావున రెవెన్యూ అధికారులు సదరు భూమిపై విచారణ చేసి సాగు చేసుకుంటున్న భూములకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు.