స్వాతి నక్షత్రం సందర్బంగా మూలవర్లకు అభిషేకం, తిరుప్పావడ సేవ
స్వాతి నక్షత్రం సందర్బంగా మూలవర్లకు అభిషేకం, తిరుప్పావడ సేవ
నెల్లూరు రూరల్ (మేజర్ న్యూస్ )
నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ పై వేంచేసియున్న వేదగిరి లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం నందు శుక్రవారం నాడు స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్బంగా మూలవర్లకు అభిషేకం , తిరుప్పావడ సేవ మరియు శుక్రవారం సందర్బంగా ఆదిలక్ష్మి అమ్మవారికి అభిషేకం కార్యక్రమాలు వేదపండితుల మంత్రోచ్చారణ ల మధ్య వైభవంగా జరిగాయి.భక్తులు అదిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని అమ్మవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదములు స్వీకరించారు .పై కార్యక్రమాలును ఆలయ కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి స్వయంగా పాల్గొని పర్యవేక్షించారు.పై కార్యక్రమాలులో రూప్ కుమార్ యాదవ్ కుటుంభ సభ్యులు , యాలమూరి రంగయ్య నాయుడు మిత్ర బృందం , అళహరి విజయ్ తదితరులు , అర్చక సిబ్బంది మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.