చెంగాలమ్మ ఆలయంలో శరన్నవరాత్రులు మూడవ రోజున అభిషేకం, గోపూజ మరియు చండి యాగం.

తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట  :   కాల్లంగి నది ఒడ్డున గలసియున్న శ్రీ శ్రీ శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం నందు శరన్నవరాత్రులు సందర్భముగా మూడవ రోజు  శ్రీ అమ్మవారికి  అభిషేకం చేస్తారు అనంతరం గోపూజ నిర్వహించి తదుపరి చండియాగం నిర్వహించారు . ఈకార్యక్రమం ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి సమక్షంలో, కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో నిర్వహిచారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన అనంతరాజు ఉమామహేశ్వర రావు  శ్రీమతి లక్ష్మీ సుభద్ర దంపతులు ఉభయకర్తలగా  వ్యవహరించారు. ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాళ చంద్రశేఖర్ రెడ్డి,  మన్నేముద్దు పద్మజ తదితరులు పాల్గొన్నారు.