ఆమ్ ఆద్మీ పార్టీ చిల్లకూరు మండలం కన్వీనర్ గా చిల్లకూరు గ్రామానికి చెందిన చేజర్ల వినోద్ 

తిరుపతి జిల్లా  చిల్లకూరు లో ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశం గూడూరు నియోజకవర్గం కన్వీనర్ అప్పంగారి జైపాల్ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమంలో లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వెంకట చలపతి మండలం లోని నాయకులకు కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.చిల్లకూరు గ్రామానికి చెందిన చేజర్ల వినోద్ ను ఆమ్ ఆద్మీ పార్టీ చిల్లకూరు మండలం కన్వీనర్ గా జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్ నియామకం  చేసారు .ఈ సందర్భముగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కోడివాక చెందు మాట్లాడుతూ పార్టీని చిల్లకూరు మండలం లో గ్రామస్తాయికి తీసుకెళ్లాలన్నారు.మండల స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం ప్రజల పక్షాన పార్టీ ఉంటుందన్నారు.ఈ రోజు నుండి చేజర్ల వినోద్ ఆధ్వర్యంలో చిల్లకూరు మండలం లో కార్యక్రమాలు జరుగుతాయి. నూతనముగా ఎన్నికైన చేజర్ల వినోద్ మాట్లాడుతూ నా పై నమ్మకంతో ఈ భాద్యతలు ఇచ్చినదుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ,రాష్ట్ర ఇంచార్జి ఆర్.మణి నాయుడు ,రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచాలపతి ,స్టేట్ జాయింట్ సెక్రటరీ కోడివాక చందు, తిరుపతి జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్, గూడూరు నియోజకవర్గం కన్వీనర్ అప్పంగారి జైపాల్ లు  కృతజ్ఞతలు  తెలియజేసారు.ఈ కార్యక్రమంలో చిల్లకూరు మండలానికి చెందిన మహేంద్ర, చైతన్య, శ్రీ కిరణ్, శ్రీనివాస్, వినీత్ మొదలగు కార్యకర్తలు పాల్గొన్నారు.

 మీ మునిరాజ

రవి కిరణాలు తెలుగు దినపత్రిక