రాష్ట్ర ప్రభుత్వం పెంచిన*23 శాతం ఫిట్ మెంట్ పై ఏపిటిఎఫ్ నిరసన
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన*23 శాతం ఫిట్ మెంట్ పై ఏపిటిఎఫ్ నిరసన
నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం ఫిట్మెంట్ ఆమోదయోగ్యం కాదని 27 శాతం ఐఆర్ కంటే తక్కువ ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఖండిస్తూ తడ, దొరవారిసత్రం, సులూరుపేట మండల ఉపాధ్యాయులు సులూరుపేట తహసిల్దారు కార్యాలయం వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఫిట్మెంట్ ను 30 శాతం గా ప్రకటించాలని, పాత హెచ్ ఆర్ ఎ. స్లాబులను కొనసాగించాలని, సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేయాలని,. 3,4, 5 తరగతుల ను ఉన్నత పాఠశాలఅందు విలీనం చేయడాన్ని వేయాలన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో మూడు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఎంవీ. శేషయ్య, శ్రీనివాసులు, విజయ్, పివి గోపీనాథ్ రావు, మేరీ షాక్, కోటేశ్వరరావు, ఉస్మాన్ భాష సుధాకర్ రెడ్డి, గిరి తదితర ఉపాధ్యాయులు విజయవంతంగా నిర్వహించారు.