నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 35 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 35 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 62 నుంచి 58 తగ్గించి , నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక టవర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్, జిల్లా కన్వీనర్ కార్తీక్ మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు
మాట తప్పం మడమ తిప్పం అని ఇప్పటికి మూడేళ్లు గడుస్తున్నా కూడా హామీలు నెరవేర్చ లేని వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేసి కేవలం పది వేల 143 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడం నిరుద్యోగులకు నిరుత్సాహపరచడం అని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిగారు కళ్ళు తెరిచి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు
అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులను కూడా నోటిఫికేషన్ను విడుదల చేసి ఇచ్చిన మాటను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ,లక్షల 84వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిగ్రీ చదివిన వారికి నిరుద్యోగ యువతకు నిరాశే మిగిలిందని, ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 లో 2607 పోస్టులను, పోలీస్ శాఖలో 7740 పోస్టులను, విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను, విద్యుత్ శాఖ లో 1200 నిరుద్యోగులకు, విద్యార్థులకు న్యాయం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోస్టులను గ్రంథాల యాల్లో 6000 పోస్టులను నింపాలి అన్నారు. చర్యలు తీసుకోవాలని, కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని,
ప్రభుత్వ ఉద్యోగ వయోపరిమితి 62 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలు తగ్గించాలని డిమాండ్
అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 62 సంవత్సరములు పెంచడం వల్ల నిరుద్యోగులు అన్యాయమై పోతారని , నిరుద్యోగలను దృష్టిలో ఉంచుకొని వయోపరిమితిని తగ్గించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్స్ కన్వీనర్ చిన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్తికేయ, నగర సహాయ కార్యదర్శి వెంకటేష్, శంకర్, చైతన్య, ఏబీవీపీ నాయకులు కిరణ్ ,మహేష్ ,నవీన్, ప్రదీప్ ,కృష్ణ ,కార్తీక్ ,రవి, సంతోష్, సుభాష్ ,గోపాల్ ,క్రాంతి ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు