నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి సూళ్ళూరుపేటలో ఏబీవీపీ నిరసన.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట:-

 పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏబీవీపీ సూళ్లూరుపేట శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్రంలో కాళీగా వున్న లక్షా 35 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నీ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

మాట తప్పం మడమ తిప్పం అని ఇప్పటికి మూడేళ్లు గడుస్తున్నా కూడా హామీలు నెరవేర్చ లేని వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేసి కేవలం పది వేల 143 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడం నిరుద్యోగులకు నిరుత్సాహపరచడమని, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని  డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 62 సం౹౹ పెంచడం వల్ల నిరుద్యోగులు అన్యాయమై పోతారని, నిరుద్యోగలను దృష్టిలో ఉంచుకొని వయోపరిమితిని తగ్గించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని  డిమాండ్ చేశారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులను కూడా నోటిఫికేషన్ను విడుదల చేసి ఇచ్చిన మాటను నెరవేర్చాలని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వెంకటేష్, నగర సంయుక్త కార్యదర్శి బాలాజీ నగర ఉపాధ్యక్షుడు చందు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.