హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రియుడికి తన కూతురినే ఇచ్చి పెళ్లి చేసిన అత్త చివరికి అతన్ని దారుణంగా హత్య చేసిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కత్తితో పొడిచి కిరాతకంగా అల్లుడిని అంతమొందించింది. ఉప్పల్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ ఏరియా కేసీఆర్ నగర్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసీఆర్ నగర్‌కి చెందిన వనిత(పేరు మార్చాం), ఆమె కూతురుతో కలసి నివాసముండేది.