కాకతీయ దినపత్రిక డివిజన్ రిపోర్టర్ వెంకయ్య............

మోటార్ బైక్ ను ఢీకొన్న ట్రాక్టర్.........

మోటార్ బైక్  లో ప్రయాణిస్తున్న వెందోటి, రమణమ్మ కు తీవ్ర గాయాలు .................

నెల్లూరు జిల్లా ;  చిల్లకూరు బైపాస్ సర్కిల్ నుండి  నెల్లూరు కు వెళ్లే సర్వీస్ రోడ్లో చిల్లకూరు అరుంధతి వాడ కు చెందిన  వెందోటి రమణమ్మ , వారి భర్త  వెందోటి వెంకయ్య  మోటార్ బైక్ పై మనుబోలు లోని  " చర్చ్ "  కి వెళుతుండగా టింబర్ లోడ్  తో వెళుతున్న ట్రాక్టర్  బైకు ను వెనక నుండి ఢీ కొనడంతో మోటార్ బైక్ లో వెనకాల కూర్చున్న వెందోటి రమణమ్మ కు తీవ్ర గాయాలయ్యాయి  ఈ సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ బ్రహ్మనాయుడు వారి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన రమణమ్మ కు మెరుగైన వైద్యం కోసం 108 లో నెల్లూరు  కు తరలించారు. ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి  విచారిస్తున్నారు.