నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో జిల్లా ఎస్పీ గారు ఆకస్మికంగా సుడిగాలి పర్యటన
తిరుపతి జిల్లా
నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో జిల్లా ఎస్పీ గారు ఆకస్మికంగా సుడిగాలి పర్యటన:
పబ్లిక్ న్యూసెన్స్ తగ్గించాలనే ముఖ్య ఉద్దేశంతో విజిబుల్ పోలీసింగ్ పెంచాం.
సరిహద్దు చెక్పోస్టులను బలోపేతం చేసి, గంజాయి అక్రమ రవాణా పై ఉక్కు పాదం.
పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడి, విషయాన్ని తెలుసుకుని పోలీసులు అండగా నిలవాలి.
జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపిఎస్.,
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్. నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో ఆకస్మికంగా సుడిగాలి పర్యటన చేశారు. నాయుడుపేట సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం, నాయుడుపేట సర్కిల్ కార్యాలయం, నాయుడుపేట, దొరవారి సత్రం, సూళ్లూరుపేట, తడ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా సందర్శించి, అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు.
విధులలో ఉన్న ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది, అధికారులతో మాట్లాడి వారి సాధక బాధలను అడిగి తెలుసుకుని, ఏవైనా శాఖా పరమైన సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు.
ఈ సందర్భంగా సూళ్లూరుపేటలో మీడియా మిత్రులతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా పోలీసు సిబ్బంది అధికారుల సమిష్టి కార్యాచరణతో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేయడం చేయగలిగామన్నారు.
సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాలలో పోలీస్ పికెట్లు, చెక్పోస్టులు లను మరికొన్ని రోజులు పాటు కొనసాగిస్తామన్నారు.
విజిబుల్ పోలీసింగ్ ను పెంచి పబ్లిక్ న్యూసెన్స్ ను తగ్గించాలని ముఖ్య ఉద్దేశంతో ప్రస్తుతం ఒక ప్రణాళికాబద్ధంగా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నామన్నారు.
సరిహద్దు చెక్పోస్టులను మరింత బలోపేతం చేసి, గంజాయి వంటి నిషేధిత వస్తువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపి, పవిత్రమైన తిరుపతి జిల్లాలో మత్తు పదార్థాల అవశేషాలు లేకుండా చేస్తామన్నారు.
తడ సరిహద్దు చెక్పోస్టును ఆకస్మికంగా తనిఖీలు చేసి, విధులలో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. చెక్ పోస్ట్ వద్ద ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించి, అవసరమైన సదుపాయాలను కల్పించాలని తడ ఎస్సై ని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీలు వెంకటాద్రి ఎస్బి, శ్రీనివాసరెడ్డి నాయుడుపేట, నాయుడుపేట సబ్ డివిజన్ సిఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.