స్వచ్చంద సంస్థల ఆత్మీయ సమావేశం
స్వచ్చంద సంస్థల ఆత్మీయ సమావేశం
ఏమి ఆశించకుండా చేసేదే నిజమైన సేవ అని ఆడిటర్ చలపతి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా స్వచ్చంద సేవా సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం ఉదయం నెల్లూరు లోని శ్రీ రేబాల లక్ష్మీ నరసారెడ్డి స్మారక భవనం (టౌన్ హాల్) నందు జిల్లా స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్వచ్చంద సేవాసంస్థల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు తమ్మినేని పాండు మాట్లాడుతూ ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలము. జిల్లాలో స్వచ్చంద సేవా సంస్థలు ఏమి ఆశించకుండా ఎంతో కృషి చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎన్. జి. ఓ. లకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలను కోరుదామని తెలిపారు. అనంతరం ఆడిటర్ చలపతిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రంలో ఆంధ్రప్రదేశ్ స్వచ్చంద సేవా సంస్థల రాష్ట్ర సెక్రటరీ కె. మురళీమోహన్ రాజు, వై.చంద్ర శేఖర్ రెడ్డి, టి.వెంకటేశ్వర్లు, ఐ. శ్రీనివాసరావు, వరపరివార్ అధినేత మాధవి, జిల్లాలోని స్వచ్చంద సేవా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.