ఎల్సిడిసి ప్రోగ్రామ్స్ పరిశీలన





 నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఎల్సిడిసి ప్రోగ్రామును (కుష్టు వ్యాధిపై) పర్యవేక్షించడానికి ఢిల్లీ నుండి సెంట్రల్ లెప్రసీ డివిజనల్ నుండి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రంగనాథ్   కన్సల్టెంట్ డాక్టర్ పురోహిత  నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఎల్సిడిసి ప్రోగ్రామ్స్ జిల్లా స్థాయిలోనూ,  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనూ సబ్ సెంటర్ వారిగా బుధవారం పరిశీలించారు. ప్రోగ్రాం యొక్క తీరుతెన్ను గ్రామస్థాయిలో ఆశా నిర్వహిస్తున్న సర్వేను నిశితంగా పరిశీలించారు.  అదేవిధంగా కొడవలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న సర్వేను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. తరువాత అక్కడ నుండి జనరల్ హాస్పిటల్లో ఉన్న టెంపరరీ హాస్పిటల్లో ఉన్న కుష్టు వ్యాధిగ్రస్తులకు కేటాయించిన టి హెచ్ వార్డును సందర్శించి సంతృప్తి వ్యక్తపరిచారు. తర్వాత జిల్లాలో ఉన్నటువంటి డి ఎఫ్ ఐ టి ని సందర్శించి అక్కడ జరుగుతున్న సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి సుజాత ,  జిల్లా కుష్టు ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ ఎస్ కే ఖాదరవల్లి జిల్లా న్యూక్లియర్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేంద్రబాబు టీహెచ్ వార్డ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీత డి ఎఫ్ ఐ టి కోఆర్డినేటర్ సతీష్  ఫిజియోథెరపిస్తున్న నరసింహులు,  మోహన్ రావు , మల్లమ్మ,  ప్రసాదాచారి  పాల్గొన్నారు