నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో సంయుక్త కలెక్టర్ శ్రీ రోనంకి కూర్మానాద్ స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

 ఈ కార్యక్రమంలో   డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మ, తెలుగు గంగ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ శ్రీ బాపిరెడ్డి,జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ సుధాకర్ రాజు,  పౌర సరఫరాల సంస్థ డిఎం శ్రీమతి పద్మ, జిల్లా రిజిస్ట్రార్   శ్రీ బాలాంజనేయులు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ  శ్రీ రంగ వరప్రసాద్, డిటిసి శ్రీ చందర్, డీఈవో శ్రీ రమేష్,  జిల్లా ఎస్సీ సంక్షేమం సాధికారతాధికారి శ్రీమతి రమాదేవి, బీసీ సంక్షేమ అధికారి శ్రీ వెంకటయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీ బ్రహ్మానందరెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పెంచలయ్య, విద్యుత్ శాఖ ఎస్. ఈ.  శ్రీ విజయకుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.---జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి నెల్లూరు