తడ బీవీ పాలెం తనిఖీ కేంద్రం వద్ద వాహన తనిఖీలలో పట్టుబడ్డ అరుదైనజాతినక్షత్ర తాబేలు
తడ బీవీ పాలెం తనిఖీ కేంద్రం వద్ద వాహన తనిఖీలలో పట్టుబడ్డ అరుదైనజాతినక్షత్ర తాబేలు
రక్షకభటునీ వృత్తిలో ఉంటూ అక్రమ సంపాదన ధ్యేయంగా పట్టుబడ్డ నిందితుడు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం బివి పాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద శుక్రవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ci ఆర్ యు వి ఎస్ ప్రసాద్ చేపట్టిన వాహన తనిఖీలలో 250 అరుదైన జాతి నక్షత్ర తాబేలు పట్టుకున్నారు.
వివరాల మేరకు తమిళనాడు చెన్నై మౌంట్ రోడ్డు చెందిన సెల్వ కుమార్ రవికుమార్ ప్రకాశం జిల్లా పామూరు నుండి చెన్నై కు అక్రమంగా కనిగిరి ఆర్టీసీ డిపో బస్సులో తరలిస్తున్న అరుదైన నక్షత్ర తాబేలు తో పాటు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు చెన్నై, ఆవడి పోలీస్ స్టేషన్లు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పవిత్రమైన పోలీసు వృత్తిలో ఉంటూ అక్రమ సంపాదన ధ్యేయంగా చెన్నైలో ఎక్వేరియం నడుపుతూ చట్టవ్యతిరేకమైన వన్యప్రాణిలను బెంగాల్, కర్ణాటక, తమిళనాడులోని వివిధ పట్టణాలకు ఎగుమతి చేసే వాడుగా తమ దర్యాప్తులో తెలిసినట్లు వెల్లడించారు. వీటి విలువ సుమారు రెండు లక్షలు రూపాయలు ఉంటుందని వీటిని చెన్నై నుండి మలేషియా కు తరలించి ఎనిమిది నుండి పది లక్షల రూపాయలు మధ్య అమ్మకాలు సాగిస్తూ నట్లు నిందితుడు విచారణలో వెల్లడైంది. పట్టుబడ్డ నక్షత్ర తాబేలు ను వెంకటగిరి అటవీశాఖ అధికారులకు అందజేయనున్నట్లు సి ఐ. పేర్కొన్నారు. ఈ దాడులలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సి ఐ. ఆర్ యు వి ఎస్ ప్రసాద్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ S.N. రసూల్ , కానిస్టేబుల్స్ M. వెంకటేశ్వర్లు P. వెంకటేశ్వర్లు, ప్రభాకర్ లు ఉన్నారు.
ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద అక్రమ రవాణాలో నిత్యం పట్టుబడుతున్న
ఆరోగ్య హానికరమైన గంజాయి తో పాటు విలువైన అటవీ సంపద, యదేచ్ఛగా అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం, ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూ లేకుండా పోయిందంటూ స్థానికంగా బలమైన ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికైనా రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బివి. పాలెం వద్ద అక్రమ రవాణాకు స్వస్తి పలికేలా ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకోవాలని, జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.