జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది.




జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది.  నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన బేటీ బచావ్ - బేటీ పడావ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలకు సాధికారత కల్పించడం .” అమ్మాయిలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి అవసరమైన సాధనాలు మరియు అవకాశాలను అందించడం  విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు ప్రాథమిక హక్కుల గురించి అవగాహన పెంచడం  బాలికలు ఇప్పటికీ అడ్డంకులను ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడంలో భారతీయ జనతా పార్టీ సహాయపడుతుంది అని అన్నారు. 

బాలికలు తమ చిన్న వయసు నుంచే కరాటే వంటి నైపుణ్యాలను నేర్చుకుంటే తమపైన జరుగుతున్న  లైంగిక దాడులను ఎదుర్కోవడానికి బాలికలు తోడ్పడుతుందని మరియు నారీ శక్తి పెంపొందించడానికి ఎంతో తోడ్పడుతుందని అన్నారు మరియు బాలికల భవిష్యత్తు కోసం 4.1 కోట్ల సుకన్య సమృద్ధి యోజన కథలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు అలాగే బాలికల వికాసానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నది NDA ప్రభుత్వం అని జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ అన్నారు. 

ఈ సమావేశంలో BJYM రాష్ట్ర నాయకులు తిరుపతి జిల్లా ఇన్చార్జి లెక్కల రాజశేఖర్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి హర్ష వర్ధన్, OBC మోర్చా రాష్ట్ర నాయకులు మరియు తిరుపతి జిల్లా ఇంచార్జి కోసూరు సుధీర్ మరియు బిజెపి మండల నాయకులు సన్నారెడ్డి సాయి కుమార్ రెడ్డి పాల్గొన్నారు.