అప్పుల బాధతో వ్యక్తి బలవన్మరణం.




పొదలకూరు మేజర్ న్యూస్..

అప్పుల బాధలు తాళలేక వ్యక్తి బలవన్మరణంకు పాల్పడిన ఘటన మండలంలోని మరుపూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు పొదలకూరు మండలం, మరుపూరు‌ గ్రామానికి చెందిన ఆకురాతి కోటేశ్వరరావు (40 సం) అప్పుల బాధతో శుక్రవారం ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం పొదలకూరు సిహెచ్సీ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.