పిల్లలకు విషమిచ్చి ఉరి వేసుకున్న ఓ తల్లి
కోట : కోట మండలం ఊనుగుంటపాలెం గ్రామం నందు కొడవలూరు ధనుంజయరెడ్డి గిరిజన కాలనీలో ఓ తల్లి ఇద్దరు మగ బిడ్డలకు విషమిచ్చి ఉరి వేసుకుని చనిపోయింది.
శుక్రవారం రాత్రి ఊనుగుంటపాలెం గిరిజన కాలనీ నందు నివాసముంటున్న పోలూరు రాణి భర్త నాగార్జున వీరికి ప్రదీప్ (5) సుధీర్ (2) సంవత్సరాల ఇద్దరు మగపిల్లలు ఉన్నా తండ్రి నాగార్జున్ నెల్లూరు నందు ఒక హోటల్ లో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య నెల్లూరులో బాడుగ ఇల్లు తీసుకుని ఉందామని విషయంపై తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని మన స్థితి గతులు బాగోలేవని మెరుగైన తర్వాత వెళ్దామని నచ్చచెప్పుకొస్తూ ఉండేవాడిని అదే విషయంపై 21 తారీఖున భర్త ఉద్యోగరీత్యా వెళ్ళిన తర్వాత ఇద్దరు మగ పిల్లలకు విషమిచ్చి రాణి ఉరివేసుకుని చనిపోయినట్టుగా స్థానికులు సమాచారమును అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.