పాఠశాల అభివృద్ధి కమిటీ, రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించిన
పాఠశాల అభివృద్ధి కమిటీ, రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించిన ..
విద్యాశాఖ అధికారులు
జలదంకి, మేజర్ న్యూస్ :-
గత ప్రభుత్వం లో విద్యాశాఖలో తీసుకువచ్చిన 117 జీవో కు ప్రత్యామ్నాయంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకువస్తుందని మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్ తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన జలదంకి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల మెయిన్ లో పాఠశాల అభివృద్ధి కమిటీ, రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు.. జలదంకి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల మెయిన్ లో మండల విద్యాశాఖ అధికారులు శ్రీధర్ నాగేశ్వరరావు పాఠశాల అభివృద్ధి కమిటీ రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు…ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖలో తీసుకువచ్చిన మార్పులను వారికి తెలియజేశారు…అనంతరం మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలిపే విధంగా లేక అందుబాటులో ని పాఠశాలల్లో కలిపే విధంగా మార్పులు తీసుకువచ్చిందని ఆయన తెలిపారు…ఉన్న అవకాశాలను బట్టి మార్పులు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు…ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పులిగుంట మధుమోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు వినోద నాయుడు, మద్దూరు .శ్రీనివాసులు రెడ్డి, సిఆర్పి రవిచంద్ర, పాఠశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..