సమస్యల పరిష్కారానికి పెద్ద పీట.........

కావలి రవికిరణాలు:

       వార్డ్ లో ప్రజలు ఎదురుకొంటున్న సమస్యలను పరిష్కరించడమే తమ ధ్యేయమని 29వ వార్డ్ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పెనుమల్లి అశోక్ అన్నారు వారం నుంచి నీరులేక ఇబ్బంది పడుతున్న ప్రజలకోసం స్థానిక MLA రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తో మాట్లాడి వార్డ్ కి ప్రత్యేకంగా మునిసిపల్ వాటర్ ట్యాంకర్స్ ని ఏర్పాటు చేశారు ఆదివారం వాటర్ ట్యాంకర్స్ ను వార్డ్ లోకి తీసుకొచ్చి ప్రజలకు అవసరమైనన్ని నీటిని దగ్గరుండి పట్టించాడు. ఇంటింటికి తిరిగి ప్రతి మహిళకు నీటిని అందించారు మరలా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టి కి తేవాలని వెంటనే MLA రామిరెడ్డి కి తెలిపి సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానని వార్డ్ ప్రజల కి హామీ ఇచ్చారు. వారం నుంచి నీరులేక ఇబ్బంది పడ్డామని సమస్య ను పరిష్కరించిన అశోక్ కు ధన్యవాదాలు తెలిపారు