ఘనంగా ఫెషర్స్ డే వేడుక.
ఘనంగా ఫెషర్స్ డే వేడుక.
ఉదయగిరి మేజర్ న్యూస్.
స్థానిక మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ కళాశాల నందు మంగళవారం రాత్రి నూతనంగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ సీనియర్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుక ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డాక్టర్ జి. కృష్ణారెడ్డి అధ్యక్షత వహించి నూతనంగా చేరిన విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యవసాయ కోర్స్ నందు మీ ఊహలను పునర్మించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని సీనియర్ విద్యార్థుల నుంచి సలహాలు తీసుకోవాలని, సీనియర్ విద్యార్థులతో స్నేహంగా మెలగాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జి రామచంద్రరావు పాల్గొని మాట్లాడుతూ విద్యాపరంగా, సామాజికపరంగా, మానసికం గాను అభివృద్ధి చెందాలని ఈ వ్యవసాయ కళాశాలలో ఆయా కోర్సులతోపాటు సాంప్రదాయకంగా నడుచుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగం గురించి మాట్లాడుతూ భారత దేశానికి వ్యవసాయం వెన్నుముక లాంటిదని, కోవిడ్ సమయంలో అన్ని రంగాలు మూతపడినను వ్యవసాయంలో రైతులు కష్టపడ్డారని ఈ దేశానికి ఆహార అభివృద్ధికి తోడ్పడి ఆ సమయంలో అందరికీ ఆహారాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషించారని అలాంటి వ్యవసాయ కోర్సులు అభ్యసిస్తున్న మీరు అదృష్టవంతులని అంతేకాకుండా దేశ భవిష్యత్తును మార్చే శక్తి విద్యార్థు లేనని కొనియాడారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిధులుగా జి శివన్నారాయణ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆత్మ పి చెన్నారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్, కే సుభద్ర, తహసిల్దార్, ఎన్ వెంకట్రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.