తడలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
తడలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
తమిళనాడుకు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన తడ పోలీసులు
శ్రీ సిటీ, తడ కాపర్ వైర్ దొంగతనం కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు
వీరి వద్ద నుంచి 6,35,000/- విలువ గల సుమారు 360 కిలోల కాపర్ వైర్, మారుతి ఈకో కార్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
కేసును చేదించిన పోలీస్ సిబ్బందిని అభినందించిన నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి.
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట, ఫిబ్రవరి 28(రవి కిరణాలు):-
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సర్కిల్ తడ పోలీస్ స్టేషన్ పరిధిలో తమిళనాడుకు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. తడ మండలం NH-16 పక్కన, పెద్ద పన్నంగాడు ఆంధ్ర బార్డర్ చెక్ పోస్ట్ వద్ద తేదీ 28-02-2023 ఉదయం 09-00 గంటల సమయంలో వాహనాల తనిఖీల్లో భాగంగా ఓ మారుతి వ్యాన్ ఆపి అందులో ఉన్న సభ్యులను ప్రశ్నించగా వారి సమాధానాలపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ సభ్యులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగావారు అంతర్రాష్ట్ర కాపర్ వైర్ దొంగల ముఠా సభ్యులుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ ముఠా సభ్యులు ఇటీవల కాలంలో శ్రీ సిటీ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కాపర్ వైర్ దొంగతనం కేసు, తడ లోని ఓ కాంట్రాక్టర్ ఇంటి వద్ద 40 కరెంట్ కాయిల్స్ దొంగతనం కేసులోని ముద్దాయిలుగా గుర్తించిన పోలీసులు వారి వద్ద నుండి చోరీ సొత్తులు అయిన 6,35,000/- రూపాయల విలువ కలిగిన సుమారు 360 కిలోల కరెంట్ వైర్ పై ప్లాస్టిక్ ను తొలగించగా వచ్చిన కాపర్ వైర్ కాయిల్స్ లను మరియు వారు నేరానికి వాడిన TN 19 AB 5708 నెంబర్ గల మారుతి ఈకో కార్ ను స్వాధీనం చేసుకున్నట్లు నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్ మీడియాకు తెలియజేశారు.
ఈ కేసును ఛేదించిన సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, తడ ఎస్సై శ్రీనివాసరెడ్డి, సూళ్లూరుపేట ఎస్సై-II శేఖర్, తడ పోలీస్ స్టేషన్ సిబ్బంది సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, అశోక్ కుమార్, సుహేల్, విజయ్ కుమార్, చంద్రాలను నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి అభినందించారు.