-రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు, జనవరి 24, (రవికిరణాలు) : వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీకోసం మొదటి నుంచి కష్టపడు వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక రూరల్ కార్యాలయంలో రాష్ట్ర ఆఫ్కాఫ్ ఛైర్మన్ కొండూరు అనిలబుకు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, కార్యాలయ ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజవర్గంలో మొదటి నుంచి కష్టకాలంలో పార్టీలో ఉన్న వారికి తప్పకుండా మంచి సముచిత స్థానం ఉంటుందన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో
మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వారికే ప్రాధాన్యం ఉంటుందన్నారు. కొండూరు అని బాబు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో వైఎస్సార్‌సీపీలో చేరారన్నారు. ప్రధానంగా కావలి నియోజక వర్గంలో కొన్ని మత్స్యకార గ్రామాలలో వైఎస్సార్సీపీ వెళ్లలేని పరిస్తితి ఉండేదన్నారు. కాని కొండూరు అనిల్ బాబు పార్టీలో చేరడంతో మత్స్యకార గ్రామాలలో వైఎస్సార్సీపీకి తిరుగులేని మెజార్టీ వచ్చిందన్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో అనిల్ బాబు  ఎన్నోకష్టాలు ఎదుర్కొన్నారని, అందు వల్ల ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అని ల్బాబుకు సముచిత స్థానం కల్పించారన్నారు. రాష్ట్రంలోనే అతిముఖ్యమైన ఆఫ్కాఫ్ ఛైర్మన్ పదవి
ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు మంత్రి అనిల్‌కుమార్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు ఎక్కువగా కృషి చేశారన్నారు. తప్పకుండా రూరల్లో కూడా పార్టీని మొదటి నుంచి కష్టపడ్డ వారిని మంచి స్థానంలో కూర్చోబెడతామన్నారు.రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వద్ద నిత్య విద్యార్థిగా ప్రతి రోజు కొత్త విషయాలు తెలుసుకునే విదంగా ఉంటుందన్నారు. కొండూరు అనిల్ బాబుకు సముచిత స్థానం రావడంతో మన జిల్లాకు మంచి వ్యక్తిని ఎన్నుకున్నట్లు జరిగిందన్నారు.కొండ్రెడ్డి రంగా రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడి అనిల్ బాబుకు సముచిత స్థానం
కల్పించారన్నారు. రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన ఆఫ్కాఫ్ ఛైర్మన్ పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు మంత్రి అనిల్‌కుమార్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు ఎక్కువగా కృషి చేశారన్నారు. తప్పకుండా రూరల్లో కూడా పార్టీని మొదటి నుంచి కష్టపడ్డ వారిని మంచి స్థానంలో కూర్చోబెడతామన్నారు.రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిందర్ రెడ్డి మాట్లాడుతూ, కష్టపడ వారికి మంచి స్థానం వస్తుందని అనే దాంట్లో కొండూరు అని బాబు, నిదర్శనమన్నారు. పార్టీకి కష్టకాలంలో ఉన్న వారికి ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి కూడా సముచిత స్థానం కల్పించారన్నారు. రూరల్లో కూడా పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి మంచి భవిష్యత్తుతో పాటు సముచిత స్థానం ఉంటుందన్నారు.అఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అని బాబు మాట్లాడుతూ తనకు ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం ఇచ్చారన్నారు. అందుకు సహకరించిన జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు జీవత కాలం రుణపడి ఉంటానన్నారు.