ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
నెల్లూరు, జనవరి 26, (రవికిరణాలు) : 26 జనవరి గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ తొలుత క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి జిల్లా స్పెషల్స్ బ్రాంచ్ క్యాంప్ ఆఫీస్ సిబ్బందికి స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపిన తదుపరి కొత్త జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేసి కార్యాలయంలోని సిబ్బందికి లడ్లు పంచి, గణతంత్ర దినోత్సవం గొప్పతనం గురించి తెలిపి, ఆనందంగా కొద్ది సమయం అందరితో సంభాషించిన అనంతరం ఎ.ఆర్. హెడ్ క్వార్టర్స్ నందు కూడా పతాకావిష్కరణ చేసి ఎ.ఆర్. అధికారులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.ప్రధాన వేడుకలలో భాగంగా జిల్లా యస్పి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కు బయలుదేరి, ఉదయం 9.00 గంటలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ యం.వి.శేషగిరి బాబు కి పుష్పగుచ్చం అందజేసి నెల్లూరు జిల్లా గణతంత్ర దినోత్సవ వేడుకలకు అహ్వానిస్తూ స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ తో పాటు గౌరవ వందనం స్వీకరించి, తదుపరి కలెక్టర్ జాతీయ జెండాను ఎగురవేసి 71వ గణతంత్ర దినోత్సవాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యొక్క అభివృద్ధికి అన్ని శాఖలు చేపట్టిన మరియు చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. తదననంతరం ప్రభుత్వ ప్రగతిని సూచించే శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ యస్పి చేతుల మీదగా 2019వ సంవత్సరంలో ఉద్యోగ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించినందుకు గానూ వారికి ప్రశంసాపత్రాలు బహుకరించడం, స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించడంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా లోని అన్నీ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఎంతో ఘనంగా విజయవంతముగా ముగిసాయి.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, వివిధ పాఠశాలల విద్యార్ధులు మరియు జిల్లా ప్రజలు పాల్గొన్నారు.