పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి : హరినాథ్ రెడ్డి





రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో భాగంగా పేదవాడి ఇంటి నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమి ఇవ్వాలని అలాగే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు రూపాయలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీ హరినాథ్ రెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన శాఖా కార్యదర్శుల వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నారని ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలకు ఏమాత్రం కృషి చేయడం లేదని దీనిపై రాష్ట్రవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగిందని ఆ పోరాట కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే దశలోనే శాఖ కార్యదర్శిల వర్క్ షాపు కార్యకర్తల సమావేశం చేయడం జరుగుతుందని ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటం సాగిస్తూనే ఉంటుందని తెలియజేశారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు అనంతరం పార్టీ నిర్మాణం శాఖ కార్యదర్శుల పనితీరు శాఖల పని విధానం ప్రజా సంఘాల నిర్మాణం తదితర అంశాల పైన ప్రొఫెసర్ రాజశేఖర్, జిల్లా కార్యదర్శి పి మురళి, చినిరాజు తదితరులు శాఖ కార్యదర్శులకు తరఫున ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట కార్యదర్శి సి సుధాకర్ రెడ్డి ,గూడూరు, సత్యవేడు నియోజకవర్గాల శాఖ కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు.