చిట్టమూరు (రవికిరణాలు టీవీ) మండల పరిధిలోని మల్లం దళితవాడకు చెందిన మేర్లపాక భాస్కర్(45) కూలి పనుల కోసం వ్యవసాయ పొలాల్లో పనిచేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నిన్న మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు మల్లం వ్యవసాయ పొలాల్లో విద్యుత్ స్తంభాలు పక్కకు వాలి వైర్లు వేలాడుతున్నా విషయం గమనించిన విద్యుత్ శాఖ అధికారులు వర్షాకాలంలో వేలాడుతున్న కరెంట్ వైర్ లకు  సప్లై నిలిపివేశారు. శుక్రవారం ఉదయం విద్యుత్ శాఖ సిబ్బంది రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నే వేలాడుతున్న కరెంట్ లైన్ లకు కు కరెంట్ సప్లై ఇవ్వడంతో పొలాల్లో కూలి పని చేసుకుంటున్నా భాస్కర్ కి విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు చరవాణి ద్వారా సమాచారం ఇచ్చి కరెంటు సప్లై ఆపాలని చెప్పిన సప్లై ఆపకు పోవడం గమనార్హం దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు భాస్కర్ మృతదేహాన్ని సబ్ స్టేషన్ వద్ద ఉంచి ఆందోళనకు దిగారు.