నెల్లూరు, జనవరి 20, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఆర్.టి.సి. సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను నిర్ణయాన్ని అసెంబ్లీలో వికేంద్రీకరణం చేసినందున వేలాదిమంది విద్యార్ధులతో మానవహారం నిర్వహించారు.ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి జరగనటువంటి అన్యాయం ఆంధ్రరాష్ట్రానికి జరిగిందని, దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని విభజించారని, ఈ రాష్ట్రాన్ని లోటు బడ్జెటులోకి నెట్టారన్నారు. చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో ఒక భ్రమరావతిని సృష్టించారని, వేల ఎకరాలను రైతుల దగ్గర నుండి లాక్కొని చంద్రబాబు నాయుడు మరియు వారి బినామీలు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, లక్షల కోట్లు సంపాదించారన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అప్పులు మిగిల్చినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి మాత్రం చెప్పిన వాగ్దానాలన్నింటిని అమలుచేస్తూ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఆలోచన చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారన్నారు. భవిష్యత్తులో రాష్ట్రానికి మరో సారి అన్యాయం అన్యాయం జరగకుండా అభివృద్ధి అంతా ఓకే కేంద్రంగా ఉండకూడదనే ఆలోచన చేశారన్నారు. అమరావతి పేరుతో భ్రమరావతితో లక్షలకోట్ల కుంభకోణం చంద్రబాబు నాయుడు హయాంలో సాగిందన్నారు. ఈ రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటుచేసి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందేవిధంగా ఆలోచన చేశారన్నారు.పై కార్యక్రమంలో పిండి సురేష్, కోడూరు కమలాకర్ రెడ్డి, మిద్దె మురళీ కృష్ణ యాదవ్, ఏసు నాయుడు, మాళెం సుధీర్ కుమార్ రెడ్డి, విద్యార్ధి నాయకులు మధన్ కుమార్ రెడ్డి, జయవర్ధన్, వై.సి.పి. నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.