ఘనంగా బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షిరాం  16 వ వర్ధంతి.

 రవి కిరణాలు న్యూస్. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-

 నియోజకవర్గ కేంద్రం లోని సూళ్లూరుపేట లో ఆదివారం నియోజకవర్గ బి.యస్.పి అధ్యక్షులు సత్యవేటి శ్రీనివాసులు అధ్యక్షత న మాన్యశ్రీ కాన్షిరాం 16 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా డా. బి అర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం  మాన్యశ్రీ కాన్షిరామ్  చిత్ర పటానికి  పూల వేసి నివాళి అర్పించారు. బహుజన పార్టీ నాయకులంతా కలిసి ఈ నెల 30 న తిరుపతి లో జరుగు  రాయల సీమ రాజ్యాధికార సభను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు .   ఈ కార్యక్రమంలో  బి యస్ పి జిల్లా కోశాధికారి కైలాసం చెంగయ్య , దొరవారి సత్రం మండల అధ్యక్షులు  అంబూరు క్షేత్రయ్య , తడ మండల అధ్యక్షులు మదనంబెటి సురేష్ , సీనియర్ నాయకులు ఇంగిలాల ఆనంద్ , మల్చి వీరయ్య  బి. యస్.యస్ వ్యవ స్థాపక అధ్యక్షులు కన్నంబాకం హరికృష్ణ,  ఎ. యస్. యస్  అధ్యక్షులు పిట్ల చిన్న , బహుజన నాయకులు , గాయకులు శంకర్ , మాజీ నెల్లూరు జిల్లా ఇంచార్జి K.గురుమూర్తి ,బహుజన నాయకులు  జై భీం అంకన్న ,తూపిలి నాగరాజు తదిరులు నివాళ్లు అర్పించారు.