రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి ఆదేశాలపై 14వ డివిజన్ లో సచివాలయ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న 14 వ డీవిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టి ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలను మరింత దగ్గర చేశారని కొనియాడారు 14 వ డీవిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాప్ రెడ్డి. రాష్ట్రం లో సచివాలయాలు ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 14వ డివిజన్ లోని సచివాలయంలో వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు.    మహాత్మా గాంధీ జయంతి రోజున సచివాలయాల ను ముఖ్యమంత్రి ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ రోజు దేశం గరవించ దగ్గ నేత లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కావడం , వారిని స్మరించు కోవడం .మన కర్తవ్య మన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు సచివాలయాల ద్వారా జగనన్న చేదోడు, విద్యాదీవెన, అమ్మఒడి,పెన్షన్ తదితర పధకాలు అందరికీ అందేలా ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నారని, ముఖ్యంగా  14వ డివిజన్ లోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణం పరిష్కరిస్తన్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయాల అడ్మిన్లు దొరబాబు, కామాక్షయ్య, వాలంటీర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.