ఘనంగా 13వ వార్షికోత్సవ కామదేను పురస్కార బహుమతి కార్యక్రమం
ఘనంగా 13వ వార్షికోత్సవ కామదేను పురస్కార బహుమతి కార్యక్రమం
ఇందుకూరుపేట, మేజర్ న్యూస్:
ఇందుకూరుపేటమండలం కొత్తూరు శ్రీ లలితా మహేశ్వరి ఆశ్రమం నందు అర్చక, వేద పండితుల 13వ వార్షికోత్సవ కామధేను పురస్కార బహుమతి ప్రధాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత గో పూజా కార్యక్రమంలో గోమాతతో పాటు పండిత పామరులు కలిసి దేవాలయం ప్రదక్షణ చేశారు. ఈ కార్యక్రమానికి ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రామాయణం మహేష్ స్వామి అధ్యక్షత వహించగా మైపాడు రాజా ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్చకులకు, వేద పండితులకు కిరీట ధారణ చేసి, గంధపు మాలలు అలంకరించి, శాలువా కప్పి, బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ అర్చక సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి డా. ఉదయగిరి వెంకట శేషాచార్యులు, రామాయణం జగదీష్ శర్మ, సురేష్ స్వామి, మణిశంకర్, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం చైర్మన్ శిఘాకొల్లు నాగరాజు, ప్రధాన కార్యదర్శి రాజా కొండయ్య, శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విశేషంగా పాల్గొన్నారు.