అట్టహాసంతో ప్రారంభమైన అమ్మవారికి 1008 కలిశాల అభిషేక కార్యక్రమం
అట్టహాసంతో ప్రారంభమైన అమ్మవారికి 1008 కలిశాల అభిషేక కార్యక్రమం
.. కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వరకు ప్రదర్శన
.. వెండి రథానికి సాగిన సంప్రోక్షణ
.. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాధ్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు
దసరా నవరాత్రోత్సవాలు మొదటి రోజే నెల్లూరు నగరంలో అత్యంత వైభవంగా సాగుతున్నాయి. నెల్లూరు స్టోన్ హౌస్ పేటలోని శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా నెల్లూర్ లోని శ్రీ రంగనాధుని దేవస్థానం నుండి పవిత్ర పెన్నా జలాలతో 1008 కలశములతో స్టోన్ హౌస్ పేటలో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అభిషేకించేందుకు ప్రదర్శన ప్రారంభమైంది
అంగరంగ వైభవంగా మేళతాళాలతో ఊరేగింపుగా రంగని సన్నిధి నుండి వాసవిమాత దేవస్థానం వరకు ఈ ప్రదర్శన సాగింది. నూతనంగా అమ్మవారి కోసం తీసుకువచ్చిన వెండి రథానికి పెన్నా నది తీరాన సంప్రోక్షణ కార్యక్రమం వైభవంగా ముగిసింది. నుడా చైర్మెన్ ముక్కాల ద్వారకా నాధ్ ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.