ఆధార్ పొంది 10 సం. పూర్తయిన వారికి ఆధార్ అప్డేట్ తప్పనిసరి

నవజాత శిశువుల  జనన ధ్రువీకరణ పత్రంను ఆధార్ అనుసంధానం చేయాలి

ఈనెల 27 నుండి 29 మార్చి వరకు అన్ని మండలాలలో  ఆధార ప్రత్యేక క్యాంపులు : జిల్లా కలెక్టర్

 రవి కిరణాలు, తిరుపతి, మార్చి 25:-

ఆధార్ పొంది 10 సం. పూర్తయిన వారు ఏదేని ఋజువు పత్రాలతో ఆధార్ అప్డేట్ తప్పనిసరిగా చేసుకోవాలని, వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి వారికి దీనిపై అవగాహన కల్పించాలని, నవజాత శిశువుల జనన ధ్రువీకరణ పత్రంను ఆధార్ అనుసంధానం చేయాలనీ, అన్ని ఆధార్ కేంద్రాలలో గ్రామ/వార్డు సచివాలయాలలో ఆధార్ సేవల నిర్ణీత రుసుముల పట్టిక ప్రదర్శించా లని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం స్థానిక కలెక్టరేట్  లో  జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ రెండవ సమావేశం  జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ వారి ఆధ్వర్యంలో జరిగింది.  ఈ సమావేశంలో కలెక్టర్  మాట్లాడుతూ ఆధార్ అనుసంధానం కాకుండా మిగిలిపోయిన వారందరూ  ఆధార్ నమోదు  చేసుకోవాలని అన్నారు. ఆధార్ పొంది 10 సం. పూర్తయిన వారు ఏదేని ఋజువు పత్రాలతో దగ్గర్లోని ఆధార్ కేంద్రాలకు వెళ్లి ఆధార్ అప్డేట్ తప్పనిసరిగా చేసుకోవాలని, వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి ప్రజలకు దీనిపై మోటివేట్ చేయాలని అన్నారు. 5 సం. మరియు 15 సంవత్సరాలు దాటిన పిల్లలకు వేలి ముద్రలు  అప్ డేషన్ కు, ఇంతవరకు ఆధార్ పొందని నవజాత శిశువుల జనన ధ్రువీకరణ పత్రాలను ఆధార్ కు అనుసంధానం చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు.  ఆధార్ నమోదుకు  .   ప్రసవాలు జరిగే అన్ని ఆసుపత్రులలో నవజాత శిశువుల జాబితా సిద్ధం చేసి సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ సిడి పి ఓ లకు జనన ధృవీకరణ పత్రాలను అందించేలా చర్యలు చేపట్టాలని, సంబంధిత జనన మరణ రిజిస్టర్ అథారిటీ అధికారులు జారీ చేసిన జనన ధృవీకరణ పత్రాలను ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదని తెలిపారు.  ఆధార్ వివరాలకు సంబంధించి ఎవరైనా గమ్మీ వేలిముద్రల తో (మోసపూరిత వేలి ముద్రలు) మోసపూరిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోబడునని, ఆధార్ నమోదు కేంద్రాల్లో పని చేయు సిబ్బంది అప్రమత్తతో మెలగాలని సూచించారు. ఆధార్ కార్డు అప్డేషన్ కొరకు ప్రజలు స్వయంగా ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చని, లేనిచో వారికి మండలంలో అందుబాటులో ఉండే ఆధార్ కేంద్రం ను సందర్శించి గుర్తింపు రుజువులు సమర్పించి రూ.50/- చెల్లించి  డాక్యుమెంట్ అప్ డేట్ చేసుకోవాలని కోరారు. బయోమెట్రిక్ ఆప్డేషన్ కొరకు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని నిర్ణీత రుసుములు పట్టిక మేరకు చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చని తెలిపారు. లెప్రసీ వ్యాధి గ్రస్తులు, విబిన్న ప్రతిభావంతులకు, ఆధార్ కేంద్రాలకు రాలేని వారికి ప్రభుత్వ పథకాలు అందేలా ఆధార్ కార్డు కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని ఆధార్ కేంద్రాలలో,  గ్రామ/వార్డు సచివాలయాలలో ఆధార్ సేవల కొరకు నిర్ణీత రుసుమల పట్టిక ప్రదర్శించాలని అన్నారు.

ఈనెల 27 నుండి 29 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులో ఏర్పాటు ప్రతి మండలాలలో ఉంటుందని ప్రజలు సరియైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి వారి ఆధార్ అప్డేషన్ లేదా నమోదు చేసుకోవాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  ప్రతి మండలంలో ఆధార్ మానిటరింగ్ కమిటీల ఏర్పాటు వాటి పనితీరు మెరుగ్గా ఉండాలని అన్నారు. ఆధార్ సేవలకు సంబందించిన సందేహాల నివృత్తి, సహాయం కొరకు టోల్ ఫ్రీ నెం.1947 కు కాల్ చేసి సమాచారం  పొందవచ్చునని తెలిపారు. అనంతరం ఆధార్ UIDAI గోడపత్రికను అధికారులతో కలసి విడుదల  చేశారు.    
   
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, UIDAI ప్రతినిధి అసిస్టెంట్ మేనేజర్ సుశీల్, సెక్షన్ ఆఫీసర్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ శ్రవణ్, పి.డి. డి.ఆర్.డి.ఎ జ్యోతి, డి.ఈ.ఓ. శేఖర్, పి.డి.డ్వామా శ్రీనివాస ప్రసాద్, ఎల్.డి.ఎం సుభాష్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జయలక్ష్మి, జిల్లా ఇన్చార్జి అధికారి గ్రామ వార్డు సచివాలయం సుశీల దేవి, గూడూరు డిఎల్ డిఓ వాణి తదితర అధికారులు పాల్గొన్నారు.