స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వరుస దాడులలో పట్టుబడుతున్న *గంజాయి 


 ఆగని అక్రమ గంజాయి *రవాణా 


తడ* బీవీ పాలెం తనిఖీ కేంద్రం వద్ద 7 కిలోల గంజాయి పట్టివేత 


 ఇద్దరు నిందితులను *అదుపులోకి తీసుకొన్న బి.వి.పాళెం చెక్ పోస్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు 


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ బీవీ పాలెం తనిఖీ కేంద్రం వద్ద ఆంధ్ర నుండి తమిళనాడు కి తరలిపోతున్న గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది.


స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సి ఐ ఆర్ యు వి ఎస్ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు 


జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు చేపట్టిన వాహన తనిఖీలలొ నెల్లూరు నుండి  చెన్నైకు వెళుతున్న రాపూర్ డిపో ఏ పీ ఎస్. ఆర్టీసీ బస్సులొ  ఒడిస్సా   రాష్ట్రానికి చెందిన బోధ జిల్లా,  కంట్మాల్ గ్రామానికి చెందిన సతాన్బాగ్ , కేస్ట్మణి అనే ఇద్దరు వ్యక్తుల నుండి 7 కేజీల గంజాయ తో పాటు ఇద్దరు నిందితులని  అదుపులోకి తీసుకున్నారు.


నిందితులు  ఒడిస్సా  ప్రదేశాల్లోని ప్రాంతంలో లో అత్యంత మత్తు కలిగించే గంజాయిని కిలో ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేసి  తమిళనాడు ప్రాంతంలో 20 వేల రూపాయలకు అమ్మకాలు సాగించేవాలుగా నిందితులు తెలిపినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ci ప్రసాద్ వెల్లడించారు.


 చెడు వ్యసనాలకు బానిసై అడ్డదారిలో అక్రమ సంపాదన బానిసై  గంజాయ్ కొనుగోలు అమ్మకాలకు పాల్పడుతున్న నిందితులు గంజాయిని తరలించినట్లు తమ దర్యాప్తు వెల్లడైందన్నారు.


బీవి పాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద తాము జరిపిన వరుస తనిఖీలలో అధిక సంఖ్యలో గంజాయి పట్టుబడడం జరిగిందన్నారు.


ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్  సి ఐ .  ఆర్ యు ఎస్ ప్రసాద్ తో పాటు ఎస్ఐ. వీ. రఘు  సత్యనారాయణ,  హెడ్ కానిస్టేబుల్  ఎస్ ఎన్ రసూల్, కానిస్టేబుల్స పి వెంకటేశ్వర్లు ఎం వెంకటేశ్వర్లు, ప్రభాకర్ తదితర సిబ్బంది ఉన్నారు