'క్లీన్ కోవూరు' నా లక్ష్యం - ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి






- కోవూరులో మురుగు కాలువల పూడికతీత పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

- సొంత నిధులతో ప్రొక్లెయిన్‌ ఏర్పాటు

- గత ప్రభుత్వ హయాంలో ప్రొక్లైన్లు ఇసుక, గ్రావెల్‌ కొల్ల గొట్టడానికి ఉపయోగించేవాళ్లు

- ఇప్పుడు ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాం

- మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలి 

- కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు


మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా “క్లీన్ కోవూరు” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిగారు అన్నారు. అభివృద్ధి విషయంలో కోవూరు నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా మారుస్తానన్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో మురుగు కాలువలలో పూడికతీత పనులకై 30 లక్షల రూపాయల సొంత నిధులతో ప్రోక్లైన్ ఏర్పాటు చేసి రాజకీయాలలో సరికొత్త అధ్యాయానికి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. గురువారం కోవూరులోని మైథిలీ థియేటర్ సమీపంలోని బాపన కాలువలో పూడిక తీయించి క్లీన్ కోవూరు కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిగారు మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో ప్రొక్లైన్లు ఇసుక, గ్రావెల్‌ కొల్ల గొట్టడానికి వినియోగిస్తే తమ పాలనలో ప్రజోపయోగ కార్యక్రమమైన పూడిక తీతకు ఉపయోగిస్తున్నామని అన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాలలో వచ్చానన్నారు. మురుగునీటి కాలవల్లో నీళ్ళు నిలిచిపోయిన కారణంగా పరిసరాల్లో దుర్గంధంతో పాటు ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో చాలా గ్రామాల్లో మురుగు నీటి కాలువలు పూడిపోయి ఉండటాన్ని స్వయంగా చూశానని, అవసరమైతే పూడికలతీతకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో రెండు ప్రొక్లైన్స్ ఏర్పాటు చేస్తామన్నారు.


నియోజకవర్గ వ్యాప్తంగా పూడికతో నిండిపోయి మురుగు నీటి పారుదలకు అవరోధం ఉన్న కాలువలలో నాయకులు చొరవ తీసుకొని సిల్ట్ క్లియరెన్స్ చేయించాలని కోరారు. కాలువ కట్టల పక్కన నివాసాలుండే పేదలకు ఇబ్బందులు రాకుండా పనులు చేపట్టాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు అధికారులకు సూచించారు. కాలువ కట్టలపై నివాసాలుండే వారు స్వచ్ఛందంగా నివాసాలు తొలగించుకుంటే వారికి ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలు చూపించాలని ఆదేశించారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో ఎక్కడైతే శానిటేషన్ సమస్యలు ఉన్నాయో ఆ గ్రామస్థులు విపిఆర్ ఫౌండేషన్ అందించే ఉచిత ప్రోక్లైన్ సేవలు వినియోగించుకొని క్లీన్ కోవూర్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని కోరారు.

కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, ఎంపిపి పార్వతి, ఎంపిటీసీ నాగరాజు, కోవూరు సర్పంచ్ యాకసిరి విజయ, టిడిపి మండలాధ్యక్షులు మల్లారెడ్డి, సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణ రెడ్డి, జెట్టి రాజగోపాల్ రెడ్డి, స్థానిక నాయకులు బాలరవి, సన్నపురెడ్డి సురేష్ రెడ్డిలతో పాటు పలువురు పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.