"పోటీకి... సై…అంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ" బుచ్చిరెడ్డిపాలెం లో పోటీకి రెడీ
"పోటీకి... సై…అంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ" బుచ్చిరెడ్డిపాలెం లో పోటీకి రెడీ
నెల్లూరు కార్పొరేషన్ లో రేపు తుది నిర్ణయం
వైసీపీ సింబల్ మీద గెలిచి పార్టీకి ఓటు వేస్తారో లేదా ద్రోహులుగా మిగిలిపోతారోనని పేర్కొంటున్న వైసీపీ నేతలు
ఫిబ్రవరి 3వ తేదీ జరగనున్న బుచ్చిరెడ్డి పాళెం నగరపాలక పంచాయతీ వైస్ చైర్ పర్సన్ల ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కౌన్సిలర్లు, ముఖ్య నాయకులతో సమావేశమై చర్చించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిగారు, కాకాణి గోవర్ధన్ రెడ్డి .
జగనన్న ఆశీస్సులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీఫారం మీద గెలిచి, పార్టీ ఫిరాయించిన వారు తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరి విధేయులుగా కొనసాగుతారో, ద్రోహులుగానే మిగిలిపోతారో తేల్చుకోవల్సిన సమయం ఆసన్నమైందన్న కాకాణి.
ధర్మానికి, అధర్మానికి జరగనున్న ఎన్నికల్లో అధర్మం తాత్కాలికంగా విజయం సాధించినా, తుది గెలుపు మాత్రం ధర్మానిదే! అని పేర్కొన్న కాకాణి
స్థానిక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇంఛార్జీల ఒత్తిడితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పోటీలో అభ్యర్థులను నిలబెట్టేందుకు సిద్ధపడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.