" కాకాణి రైతులు, అధికారులతో కలిసి వ్యవసాయం, ఎరువుల సరఫరాపై సమీక్ష"
" కాకాణి రైతులు, అధికారులతో కలిసి వ్యవసాయం, ఎరువుల సరఫరాపై సమీక్ష"
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలంలో రైతులు, అధికారులతో కలిసి పంటల సాగు, ఎరువుల సరఫరా, తదితర అంశాలపై చర్చించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
తోటపల్లి గూడూరు అగ్రికల్చర్ సొసైటీ గోడౌన్ లో రైతాంగ అవసరాలకు సిద్ధంగా ఉంచిన వివిధ రకాల ఎరువుల నిల్వలను పరిశీలించిన ఎమ్మెల్యే కాకాణి.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం ద్వారా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి.
యనాది కుటుంబాలకు మంచాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.
సర్వేపల్లి నియోజకవర్గంలో దాదాపు 1లక్షా 40వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రబీ సీజన్ లో, అవసరమైన వివిధ రకాల వరి విత్తనాలు సబ్సిడీపై అందించాం. నవంబర్ లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న నారుమళ్లకు, 80 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేశాం. సర్వేపల్లి నియోజకవర్గంలో "వై.యస్.ఆర్. యంత్ర సేవ" ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి, రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీ రూపంలో అందజేస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో వై.యస్.ఆర్.రైతు భరోసా కింద ప్రతి ఏడాది 100 కోట్ల పైన ఆర్థిక సహాయం రైతాంగానికి అందజేస్తున్నాం. రైతులు రుణం తీసుకొని సకాలంలో చెల్లిస్తే, "వై.యస్.ఆర్. సున్నా వడ్డీ" పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎరువుల కొరత ఉన్నప్పటికీ, సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడా ఎరువుల సమస్య లేకుండా, రైతాంగానికి సకాలంలో అందిస్తున్నాం. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు ఎరువుల కోసం వెంపర్లాడకుండా, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, ఇంటి ముంగిటకే చేరుస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. రైతాంగానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు సమృద్ధిగా ఎరువులు అందించడంతో పాటు, రైతాంగ అవసరాలకు నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ సొసైటీల గోడౌన్లలో నిల్వ ఉంచుతున్నాం. రైతులు, రైతు భరోసా కేంద్రాలతో పాటు, తమకు సమీపంలో ఉన్న సొసైటీల ద్వారా కూడా అవసరమైన ఎరువులు తీసుకునే వెసలుబాటు కల్పిస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడా, లేని ఎరువుల సమస్యను ఉన్నట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నించి, కొంతమంది పెద్ద మనుషులు భంగపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో భూమి కొనుగోలు పథకం ద్వారా భూమి పొంది, వ్యవసాయం చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ రైతులకు సబ్సిడీ కాకుండా ప్రభుత్వానికి బకాయి పడ్డ, బకాయిలను రద్దుచేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయం చేసుకుంటున్న ఎస్సి, ఎస్టి రైతులు తమ భూములపై ప్రభుత్వానికి ఉన్న బకాయిలను రద్దు చేయడంతో, గతంలో సమర్పించిన భూమి తనఖా పత్రాలను విడిపించి, లబ్ధిదారులకు త్వరలోనే అందజేస్తాం. సర్వేపల్లి నియోజకవర్గ రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచి, ఎవ్వరికి, ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా చిత్తశుద్ధితో పని చేస్తాం