“రేపటి నుంచి జరగబోవు జగనన్న సురక్ష కార్యక్రమాలను విజయవంతం చేయండి” : ఎమ్మెల్యే సంజీవయ్య

రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట.

శుక్రవారం నాయుడుపేట ఆర్ అండ్ బి అతిథి గృహమునందు జరిగిన ప్రెస్ మీట్లో సూళ్లూరుపేట శాసనసభ్యులు మరియు టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులు కిలివేటి సంజీవయ్య గారు మాట్లాడుతూ రేపటి నుంచి జరగబోవు జగనన్న సురక్ష కార్యక్రమాలను నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోనూ విజయవంతం చేయవలసిందిగా నాయకులకు అధికారులకు సూచనలు తెలియజేశారు

జగనన్న సురక్షతో జనన, మరణ, వివాహ, తదితర పత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి ఇళ్లకే వెళ్లి ధృవపత్రాలను అందజేస్తారు

రాష్ట్రంలో ఇప్పటికే అర్హులైన ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. ఇంకా అర్హులైన ఏ ఒక్కరూ లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశ్యంతో కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా.. లంచాలకు, వివక్షకు తావులేకుండా.. నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించాలన్నదే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి తాపత్రయం అని ఎమ్మెల్యే సంజీవయ్య గారు అన్నారు. ఈకార్యక్రమంలో పట్టణ, మడల వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.