"రైతులతో కాకాణి సమీక్ష"
"రైతులతో కాకాణి సమీక్ష"
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు తెలుగుగంగ 1వ బ్రాంచ్ కెనాల్ ద్వారా అందిస్తున్న సాగునీటి పరిస్థితిని రైతులు, అధికారులతో కలిసి పరిశీలించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో చివరి ఆయకట్టు భూములకు కూడా సాఫీగా సాగునీరు అందిస్తున్నాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులు, కాలువల గండ్లు తక్షణమే పునరుద్ధరించి, ఎటువంటి లోటు రానివ్వకుండా సమృద్ధిగా సాగునీరు అందిస్తున్నాం. తెలుగుదేశం హయాంలో మాదిరి సాగునీరు సరఫరా సరిగా లేక, రైతుల మధ్య వివాదాలు తలెత్తే పరిస్థితి రాకుండా, ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. తెలుగుదేశం హయాంలో లాగా రైతులు ఎవ్వరూ, సాగునీటి కోసం కాలువలపై తిరిగే అవకాశం లేకుండా సజావుగా సాఫీగా సాగునీరు అందిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎరువుల కొరత ఏర్పడినా, సర్వేపల్లి నియోజకవర్గ రైతాంగానికి వ్యవసాయ అవసరాల మేరకు ఎరువుల సరఫరా చేస్తున్నాం. రైతులెవ్వరూ కూడా ఎరువుల కోసం వెతుక్కుంటూ వెళ్లవలసిన అవసరం లేకుండా, రైతు భరోసా కేంద్రాల ద్వారానే అవసరమైన ఎరువుల పంపిణీ చేపడుతున్నాం. ప్రస్తుత వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ, మినుము, పెసర లాంటి పంటలకు ఏర్పడిన నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదించిన నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటాం. రైతులు తమ పంటను పండించడానికి అవసరమైన సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తూ, తాము పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించే వరకు నిత్యం అందుబాటులో ఉంటూ, నిరంతరం పర్యవేక్షిస్తాం.